First HMPV Case in India: భారతదేశంలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ తొలి కేసు..! 1 d ago

featured-image

 హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ తొలి కేసు భారతదేశంలో బెంగళూరు నగరంలో నమోదైంది.

అసలేంటీ HMPV వైరస్:

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకారం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేస్తున్న డచ్ పరిశోధకులు 2001లో దీన్ని మొదటిసారిగా గుర్తించారు. ఈ వైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతోంది.

HMPV అనేది RNA వైరస్. ఇది న్యుమోవిరిడే, మెటాప్ న్యూమో వైరస్ జాతికి చెందింది.

HMPV వైరస్ లక్షణాలు:

HMPV వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహా మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, జలుబు, గొంతునొప్పి సాధారణ లక్షణాలతో ఈ వైరస్ లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల‌లో శరీరం పై దద్దుర్లు రావటం.

ఎలా సోకుతుంది:

ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని ఇంక్యుబేషన్ టైం(ఈ వైరస్ వృద్ధి చెండానికి పట్టే సమయం) 3 నుండి 6 రోజులు. ఈ వైరస్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు, రోగనిరోధ‌కశక్తి బలంగా లేనివారిపై దాడి చేస్తుంది. చలికాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

నివారణ చర్యలు:

HMPV వైరస్ నివారణకు ఎలాంటి టీకాలు అందుబాటులో లేవు. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం చేయాలి. రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం వంటివి చేయాలి. అలాగే పరిశుభ్రతను పాటించ‌డం, ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం.

వైరస్ నిర్ధారణ:

ఈ వైరస్ నిర్ధారణకు న్యూక్లియర్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ (NAAT) ద్వారా వైరల్ జన్యువును గుర్తించడం. ఇమ్యూనోఫ్లోరోసెన్స్ (IMMUNOFLUORESCENCE) లేదా ఎంజైమ్ ఇమ్యూనోఅస్సే(IMMUNOASSAY) ఉపయోగించి శ్వాసకోశ స్రావాలలో వైరల్ యాంటీజెన్ లను గుర్తించడం.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD